Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:06 PM

మహిళా కళకు వేదిక – శివనేనిగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో ముగ్గుల సంబరాలు

16-01-2026 139 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శివనేనిగూడెంలో సంక్రాంతి ముగ్గుల సంబరాలు

స్థానికం ప్రధాన ప్రతినిధి

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చిట్యాల మున్సిపాలిటీ ఫస్ట్ వార్డు శివనేనిగూడెంలో బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు రుద్రవరం లింగస్వామి గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళల నుంచి విశేష స్పందన లభించింది.

ఈ ముగ్గుల పోటీల్లో 100 మంది మహిళలు పాల్గొని రకరకాల కళాత్మకమైన, సంప్రదాయ ముగ్గులతో గ్రామాన్ని రంగులమయం చేశారు. మహిళల సృజనాత్మకతకు ఈ కార్యక్రమం ప్రత్యేక వేదికగా నిలిచింది.

పోటీల్లో ఉత్తమంగా వేసిన ముగ్గులను ఎంపిక చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ బహుమతులు అందజేయడంలో సహకరించిన మిత్రులు కన్నబోయిన శ్రీధర్ గారికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముగ్గుల ఎంపిక, బహుమతి ప్రదాన కార్యక్రమంలో పుడమి సాహితీ వేదిక అధ్యక్షులు, ఉపాధ్యాయులు చిలుముల బాల్ రెడ్డి, రుద్రవరం కృష్ణయ్య (లెక్చరర్), గాదె లింగస్వామి (లెక్చరర్), రుద్రవరం స్వామి టీచర్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చొప్పరి మల్లయ్య, రుద్రవరం దశరథ, రుద్రవరం సునీల్, రుద్రవరం కుమార్, రుద్రవరం నరేష్, రుద్రవరం సహదేవలు, ఏడ్ల మహాలింగం, చిలుముల వెంకట్ రెడ్డి, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, నూతి కాశీరం, రుద్రవరం గణేశా, రుద్రవరం మధు, రుద్రవరం వంశీ, రుద్రవరం శ్రీకాంత్, ఎటలె నవీన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

మహిళా కళకు వేదిక – శివనేనిగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో ముగ్గుల సంబరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News