Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:02 PM

మహాశివరాత్రి సందర్భంగా చెరువుగట్టు దేవస్థానంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక పూజలు

15-02-2026 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు అర్చకులు వేదమంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా దేవస్థానంలో భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.

Sthanikam

మహాశివరాత్రి సందర్భంగా చెరువుగట్టు దేవస్థానంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక పూజలు

Article Image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు అర్చకులు వేదమంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా దేవస్థానంలో భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News