Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:05 AM

మహేశ్వరంలో బిఆర్ఎస్‌కు భారీ షాక్

మహేశ్వరంలో బిఆర్ఎస్‌కు భారీ షాక్

మహేశ్వరంలో బిఆర్ఎస్‌కు భారీ షాక్
08-01-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామకృష్ణాపురం డివిజన్‌లో కాంగ్రెస్‌లోకి చేరికలు… మహిళా నేత అనురాధ పార్టీలో విలీనం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్‌లో బిఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బిఆర్ఎస్ పార్టీ మహిళా జనరల్ సెక్రెటరీ అనురాధ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేగింది. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, టిపిసిసి సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి సమక్షంలో, చిలుక ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దేప భాస్కర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆమెకు స్వాగతం పలికారు.

అనంతరం దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న పారదర్శక, పేదల పక్షపాతి పాలనకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరుతుండటంతో ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో రామకృష్ణాపురం డివిజన్‌లో బిఆర్ఎస్, బీజేపీ నేతలు వరుసగా కాంగ్రెస్‌లో చేరడం శుభపరిణామమని పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూన్న గణేష్, ఏఎంసీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు, ఆలయ కమిటీ చైర్మన్లు సురేష్, తలాటి రమేష్, యువజన కాంగ్రెస్ నాయకులు ముప్పిడి లింగస్వామి గౌడ్, జ్ఞానేశ్వర్ యాదవ్, పెద్దవూర సైదులు, భూపాల్ రెడ్డి, సంతోష్, రేణుక, స్వరూప, మాధవి, కవిత, ప్రమీల, రమాదేవి, లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహేశ్వరంలో బిఆర్ఎస్‌కు భారీ షాక్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News