Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:47 PM

లంబాడి హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష

లంబాడి హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష

లంబాడి హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష
22-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

‘మన రోడ్డు–మన భద్రత–మన బాధ్యత’ నినాదంతో LHPS ఉద్యమం

యాదాద్రి భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

లంబాడి హక్కుల సాధన కోసం లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. ‘మన రోడ్డు–మన భద్రత–మన బాధ్యత’ అనే నినాదంతో చేపట్టనున్న ఈ ఉద్యమం ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది.

యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని గుండ్లగూడెం రైల్వేగేటు సమీపంలో శుక్రవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు LHPS నాయకులు ప్రకటించారు. రోడ్డు భద్రత సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడంతో పాటు, లంబాడి తండాల ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని స్థానిక గ్రామాల నాయకులు, ప్రజలు, LHPS రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, సభ్యులు, అఖిలపక్ష పార్టీల ప్రతినిధులకు సమితి పిలుపునిచ్చింది. ప్రజల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఒక్కతాటిపైకి వచ్చి ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.

లంబాడి సమాజానికి సంబంధించిన మౌలిక సమస్యల పరిష్కారానికి ఈ ఆమరణ నిరాహార దీక్ష ఒక కీలక మైలురాయిగా నిలవనుందని నాయకులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

లంబాడి హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News