Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:12 AM

కుమారుడికి విషమిచ్చి హతమార్చి.. తానూ ఆత్మహత్య

11-01-2026 400 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మీర్పేటలో కలకలం రేపిన కుటుంబ విషాదం

భర్త వేధింపులే కారణమంటున్న మృతురాలి బంధువులు

బాలాపూర్, స్థానికం ప్రధాన ప్రతినిధి:

రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ మహిళ తన 11 నెలల కుమారుడికి విషమిచ్చి హతమార్చి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మృతురాలి తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

మీర్పేట ఇన్‌స్పెక్టర్ శంకర్‌కుమార్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ యశ్వంత్‌రెడ్డికి అదే ప్రాంతానికి చెందిన సుస్మిత (27)తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహానంతరం దంపతులు హస్తినాపురం జయకృష్ణ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి అశ్వంత్ నందన్‌రెడ్డి (11 నెలలు) అనే కుమారుడు ఉన్నాడు.

బాలుడి తొలి పుట్టినరోజు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితమే కుటుంబ సభ్యులు షాపింగ్ కూడా చేశారు. గురువారం ఉదయం యశ్వంత్‌రెడ్డి ఆఫీసుకు వెళ్లగా, మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో బెడ్‌రూమ్‌లో సుస్మిత ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. అదే గదిలో చిన్నారి అశ్వంత్ నందన్‌రెడ్డి మృతదేహం కనిపించింది.ఇక ఘటన సమయంలో ఇంట్లో ఉన్న సుస్మిత తల్లి లలిత (50) అపస్మారక స్థితిలో పడిపోయి ఉండగా, ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రాథమిక విచారణలో సుస్మిత ముందుగా కుమారుడికి విషమిచ్చి అనంతరం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతురాలి తల్లి అపస్మారక స్థితికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు.

ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. భర్త యశ్వంత్‌రెడ్డి సుస్మితను తీవ్రంగా వేధించేవాడని, బయటకు వెళ్లనీయకుండా,ఎవరితోనూమాట్లాడనివ్వకుండా ఆంక్షలు విధించేవాడని ఆరోపించారు. భర్త వేధింపుల కారణంగానే సుస్మిత ఈ అఘాయిత్యానికి పాల్పడిందని ఆమె పెదనాన్న సంజీవరెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ శంకర్‌కుమార్ నాయక్ తెలిపారు.

Sthanikam

కుమారుడికి విషమిచ్చి హతమార్చి.. తానూ ఆత్మహత్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News