Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:15 PM

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. వీరేశం

24-01-2026 150 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

స్థానికం – ప్రధాన ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నదన్నారు. మహిళలకు నైపుణ్య శిక్షణ, సమావేశాల నిర్వహణ కోసం ఇందిరా మహిళా శక్తి భవనాలను మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ భవనాల ద్వారా మహిళా సంఘాలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.

త్వరలో బస్వాపూర్ నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి ఈ మండలంలో ఇరవై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. అలాగే నూతన తహశీల్దార్ కార్యాలయ నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ లాల్ బహుదూర్, వ్యవసాయ అధికారి ఎజాజ్ అలీ ఖాన్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి పాల్గొన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు మారపల్లి మల్లారెడ్డి, కంచి మధుసూదన్, చిల్ల మధురవేణి సురేష్, పైళ్ళ చందన వెంకట్ రెడ్డి, వెలగపూరి జనని, కోళ్ల రామకృష్ణ, చల్ల వరలక్ష్మి, బాచుప్పల మాధవి, ఈడెం రాధశ్రీనివాస్, పట్టణ ఉపసర్పంచ్ మోటె రమేష్, నాయకులు గంగుల రాజిరెడ్డి, జినుకల ప్రభాకర్, మేడి రవిచంద్ర, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్, పూస బాలనర్సయ్య, ఎండి జమీరుద్దీన్, వనం చంద్రశేఖర్, ఎండీ అక్రమ్, ఎర్ర శేఖర్ గౌడ్, మోటే మహేష్, గంపల రామచంద్రారెడ్డి, కొమ్ము రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. వీరేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News