Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:33 PM

కోతులారం కుమ్మర ముద్దుబిడ్డ లింగస్వామి కి అరుదైన సత్కారం

28-01-2026 170 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వివేకానంద ఐకాన్ పురస్కారంతో రాపోలు లింగస్వామికి ఘన గౌరవం

జర్నలిజం–సమాచార హక్కు సేవలతో ప్రజల గళంగా గుర్తింపు

అవార్డుల వరుసలో మరో మైలురాయి
స్థానికం ప్రధాన ప్రతినిధి

స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతులను పురస్కరించుకుని తెలుగు వెలుగు సాహితి వేదిక ఆధ్వర్యంలో హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన జాతీయ పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జర్నలిజం, సమాచార హక్కు, సామాజిక సేవల రంగాల్లో విశిష్ట సేవలు అందించిన రాపోలు లింగస్వామికి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ పురస్కారం, ప్రశంస పత్రంతో ఘనంగా సన్మానించారు.

జర్నలిస్టుగా, సమాచార హక్కు కార్యకర్తగా ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకువచ్చిన రాపోలు లింగస్వామి సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని వక్తలు ప్రశంసించారు. నిజాయితీ, ధైర్యం, ప్రజాపక్షపాతంతో ఆయన చేసిన కృషి ప్రజల మన్ననలను పొందుతోందన్నారు.

ఇదివరకే ఆయనకు క్రాంతి జ్యోతి ఎక్స్‌లెన్స్ పురస్కారం, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు, ఉత్తమ జర్నలిస్టు అవార్డు వంటి పలు పురస్కారాలు లభించాయి. అలాగే సమాచార హక్కు ఉద్యమంలో చేసిన విశిష్ట కృషికి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రత్యేక స్థానం దక్కడం మరో ఘనతగా నిలిచింది.

సామాన్య కుటుంబ నేపథ్యంతో ఎదిగి, ప్రజా సమస్యలపై పోరాడుతూ సమాజానికి వాణిగా నిలిచిన రాపోలు లింగస్వామి, సమాచార హక్కు చట్టాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాల ద్వారా సామాజిక సేవల్లోనూ తన సేవాభావాన్ని చాటుకున్నారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిల వరకు వరుసగా అవార్డులు అందుకుంటూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న రాపోలు లింగస్వామిని పలువురు అభినందిస్తున్నారు. జర్నలిజం–సమాచార హక్కు–సామాజిక సేవల సమన్వయంతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన ఆయన, నేటి యువతకు ప్రేరణగా నిలుస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

కోతులారం కుమ్మర ముద్దుబిడ్డ లింగస్వామి కి అరుదైన సత్కారం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News