Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:08 PM

కూరెళ్ల గ్రంథాలయంలో డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు ‘అమ్మానాన్నల జీవన సౌపాల్య పురస్కారం’

17-01-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దాసోజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

వెల్లంకి, స్థానికం ప్రధాన ప్రతినిధి

విద్య, సాహిత్య రంగాలకు చిరస్థాయిగా సేవలందిస్తున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు దాసోజు ఫౌండేషన్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. మంగళవారం వెల్లంకి గ్రామంలోని కూరెళ్ల గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దాసోజు వజ్రమ్మ, విశ్వనాథ చారి గార్ల జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన **‘అమ్మానాన్నల జీవన సౌపాల్య పురస్కారం’**ను ఆయనకు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రశంసాపత్రంతో పాటు రూ.10,116 నగదు పురస్కారాన్ని ఫౌండేషన్ ప్రతినిధులు సమర్పించారు. దాసోజు ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ దాసోజు పద్మావతి మదనాచారి, వ్యవస్థాపక అధ్యక్షులు దాసోజు గోవర్ధనాచారి (ప్రముఖ న్యాయవాది, హైదరాబాద్), భాస్కరాచారి, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ అపర్ణ (హైదరాబాద్), డాక్టర్ విశ్వపతి తదితరులు ఆచార్య కూరెళ్ల గ్రంథాలయానికి చేరుకొని డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను శాలువాతో సత్కరించారు.

వక్తలు మాట్లాడుతూ, డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య చేసిన సేవలు కేవలం విద్యావ్యవస్థకే పరిమితం కాకుండా సమాజ నిర్మాణానికి దోహదపడినవని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాల ఏర్పాటు ద్వారా పఠన సంస్కృతిని పెంపొందించడంలో ఆయన చేసిన కృషి అనేక తరాలకు మార్గదర్శకమని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో కూరెళ్ల ఫౌండేషన్ అధ్యక్షులు బోగోజు గోవర్ధనాచారి, కార్యదర్శి కె. నర్మద, తపతి, గ్రంథపాలకుడు తాటిపాముల స్వామి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

కూరెళ్ల గ్రంథాలయంలో డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు ‘అమ్మానాన్నల జీవన సౌపాల్య పురస్కారం’

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News