Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:09 PM

కోదాడ పట్టణంలో పోలీసు అధ్వర్యంలో హెల్మెట్ వినియోగం పై అవగాహన ర్యాలీ..

28-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

హెల్మెట్ ధరించి ప్రమాదాలలో రక్షణ పొందండి.. కోదాడ డివిజనల్ డీఎస్సీ శ్రీనివాసరెడ్డి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యచరణ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కోదాడ పట్టణంలో కోదాడ పట్టణ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ వినియోగం పై అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగినది. కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని కోదాడ సబ్ డివిజనల్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ శివశంకర్ తో కలిసి ప్రారంభించారు. ర్యాలీ ఖమ్మం క్రాస్ రోడ్డు నుండి రంగా థియేటర్ క్రాస్ రోడ్డు వరకు నిర్వహించి స్థానిక ప్రజలకు, వాహనదారులకు, స్థానిక వ్యాపారులకు హెల్మెట్ వినియోగం పట్ల అవగాహన కల్పించారు. ర్యాలీ నందు పట్టణ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, స్థానిక పౌరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోదాడ డివిజన్ డీఎస్సీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల అనుకోని రోడ్డు ప్రమాదాలలో ప్రాణాపాయం నుండి రక్షణ పొందవచ్చునని సూచించారు. ద్విచక్ర వాహనంపై కూర్చునే వారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత హెల్మెట్ వినియోగం అవగాహన ర్యాలీని నిర్వహించామని తెలిపారు. ప్రతి పౌరుడు, ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాల పట్ల, సురక్షిత ప్రయాణం పట్ల, రహదారుల వినియోగం పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యం చేరడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రజలకు రోడ్డు నియమాల పట్ల, జాగ్రత్తల పట్ల విస్తృతంగా అవగాహన కల్పిస్తుందని ప్రజలు వాహనదారులు గమనించాలని కోరారు. వాహనదారులు వాహనాలు నిదానంగా నడపాలని అన్నారు.ఈ ర్యాలీలో పట్టణ ఇన్స్పెక్టర్ శివశంకర్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, పట్టణ ఎస్ఐ సుధీర్, పోలీసు సిబ్బంది స్థానిక పౌరులు పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

కోదాడ పట్టణంలో పోలీసు అధ్వర్యంలో హెల్మెట్ వినియోగం పై అవగాహన ర్యాలీ..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News