Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:31 PM

కంచనపల్లిలో సేవా పథం ఐదవ రోజుకు చేరుకున్న ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం

25-01-2026 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

కంచనపల్లి గ్రామంలో నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), నల్గొండ ఎన్.ఎస్.ఎస్ యూనిట్–4 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శీతకాల ప్రత్యేక శిబిరం ఐదవ రోజుకు చేరుకుంది. గ్రామాభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న ఈ శిబిరంలో వాలంటీర్లు శ్రమదానం, సామాజిక అవగాహన కార్యక్రమాలతో తమ సేవా దృక్పథాన్ని చాటుతున్నారు.ఆదివారం శిబిరంలో భాగంగా వాలంటీర్లు గ్రామంలోని వాటర్ ట్యాంక్ పరిసరాలలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. ప్రజారోగ్య పరిరక్షణకు దోహదపడే ఈ కార్యక్రమం గ్రామస్తుల ప్రశంసలు అందుకుంది.

ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారి మంద సావిత్రి, వాలంటీర్లు, గ్రామ యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. వాలంటీర్ల సేవలను పరిశీలించిన గ్రామ సర్పంచ్ ముప్పిడి మహేశ్వరి వారిని అభినందించి ప్రోత్సహించారు

మధ్యాహ్న భోజనం అనంతరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటు హక్కు విలువపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతను వివరించిన ప్రోగ్రాం అధికారి, పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని సూచించారు.

అనంతరం వాలంటీర్లు గ్రామ పాఠశాల ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి పరిసరాలను శుభ్రపరిచారు. సేవా భావనతో పాటు ప్రజాస్వామ్య చైతన్యాన్ని పెంపొందించే దిశగా శిబిరం సాగుతోందని గ్రామ పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Sthanikam

కంచనపల్లిలో సేవా పథం ఐదవ రోజుకు చేరుకున్న ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News