Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:39 PM

కంచనపల్లిలో జాతీయ సేవా పథకం శిబిరంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

26-01-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

కంచనపల్లి గ్రామంలో నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నల్గొండ జాతీయ సేవా పథకం నాలుగో విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శీతకాల శిబిరం సందర్భంగా సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

గ్రామ సర్పంచ్ ముప్పిడి మహేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వరూప, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, జాతీయ సేవా పథకం కార్యక్రమాధికారి మంద సావిత్రి, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యక్రమాధికారి మంద సావిత్రి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. దేశ నిర్మాణంలో యువత సేవాభావం కీలకమని, గ్రామ స్థాయి అభివృద్ధితోనే జాతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వెడుకల అనంతరం వాలంటీర్లు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సర్వే చేపట్టారు. ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయడమే లక్ష్యంగా ఈ సర్వే నిర్వహించారు.శిబిరాన్ని సందర్శించిన సర్పంచ్ ముప్పిడి మహేశ్వరి వాలంటీర్లతో మాట్లాడి వారి సేవలను అభినందించారు. జాతీయ సేవా పథకం శిబిరం ద్వారా గ్రామానికి మేలు జరుగుతోందని, యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావడం ప్రశంసనీయమని తెలిపారు.

Sthanikam

కంచనపల్లిలో జాతీయ సేవా పథకం శిబిరంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News