Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:48 PM

కంచనపల్లిలో ఘనంగా ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం

23-01-2026 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కంచనపల్లి, స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కంచనపల్లి గ్రామంలో శుక్రవారం 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్‌జీ ప్రభుత్వ కళాశాల (స్వయం), నల్గొండకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–IV ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముప్పిడి మహేశ్వరి, పంచాయతీ కార్యదర్శి ఎం. స్వరూప, వార్డు సభ్యులు, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం. పద్మతో పాటు ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–IV ప్రోగ్రామ్ ఆఫీసర్ మంద సావిత్రి, వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రతిజ్ఞ అనంతరం సావిత్రి ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించి ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అనంతరం మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహ నిషేధ చట్టం–2006 అమలులో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేపట్టారు. బాల్య వివాహ విముక్త రథం ప్రచారంలో భాగంగా ‘స్టాప్ చైల్డ్ మ్యారేజెస్’, ‘బాల్యం పిల్లల హక్కు’ వంటి నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆశ్రిత జిల్లా కోఆర్డినేటర్ ఎం. శోభారాణి, డీసీపీయూ కౌన్సిలర్ ఎన్. రేవతి, ఆశ్రిత ఎన్‌జీఓ సోషల్ వర్కర్ పి. ధనమ్మ, వాలంటీర్లు పాల్గొన్నారు.మధ్యాహ్న భోజనం అనంతరం వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జువాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. గంజి భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, బాలికలు మనోధైర్యాన్ని పెంపొందించుకుని జీవితానికి సంబంధించిన నిర్ణయాలను ఆత్మవిశ్వాసంతో తీసుకోవాలని సూచించారు. చిన్న సమస్యలకు ఆందోళన చెందకుండా లక్ష్యంతో ముందుకు సాగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయుడు జానయ్య, ప్రోగ్రామ్ ఆఫీసర్ సావిత్రి, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Sthanikam

కంచనపల్లిలో ఘనంగా ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News