Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:24 AM

కిషోర బాలికల నుంచి వృద్ధుల వరకు సంఘాల ఏర్పాటుకు పిలుపు

19-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో మంగళవారం మండల సమాఖ్య అధ్యక్షురాలు, మండల సమాఖ్య ఏపీఎం అనంతయ్య సమక్షంలో ఐదు రౌండ్ల సీనియర్ సీఆర్‌పీల ద్వారా రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా చేయడం, సంఘాల బలోపేతంపై అవగాహన కల్పించడం జరిగింది. గ్రామాల్లో కిషోర బాలికల సంఘాలు, వృద్ధుల సంఘాలు, వికలాంగుల సంఘాలను కొత్తగా ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. అలాగే మహిళల విద్య ప్రాముఖ్యత, బాలికల వ్యక్తిగత భద్రత, ఆరోగ్యం, స్వయం ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై కోటేశ్వరరావు మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు అప్రమత్తంగా ఉండాల్సిన విషయాలు, భద్రతా చర్యలు మరియు సమాజంలో ధైర్యంగా ముందుకు సాగేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య సీసీలు,ఓబీలు,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కిషోర బాలికల నుంచి వృద్ధుల వరకు సంఘాల ఏర్పాటుకు పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News