Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:06 PM

కెసిఆర్ హయాంలోనే నిజమైన అభివృద్ధి శివనేని గూడెంలో చిరుమర్తి లింగయ్య ప్రచారం

27-01-2026 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కోవిడాల మహేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు శివనేనిగూడెంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో శివనేనిగూడెంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు క్లుప్తంగా వివరించారు. అలాగే అబద్ధాలు, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఎలా మోసగించిందో, గత రెండేళ్లుగా అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ప్రజలకు బాకీ పడిన అంశాలను ప్రజలకు వివరించారు.

చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ…

కేసీఆర్ హయాంలో శివనేనిగూడెంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశామని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దాదాపు రూ.2 కోట్లకు పైగా నిధులతో ఈ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను పూర్తి చేశామని చెప్పారు. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల ప్రభావంతో నేటికీ ప్రజల నోట కేసీఆర్ పేరు వినిపిస్తోందని అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పథకాలు సకాలంలో అమలయ్యేవని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని ప్రజలే ముక్తకంఠంతో చెబుతున్నారని తెలిపారు. అన్నివర్గాల ప్రజలు కేసీఆర్‌ను కోల్పోయామని బాధ పడుతున్నారని చెప్పారు.

స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గత రెండేళ్లుగా శివనేనిగూడెంలో తట్టెడు మట్టికూడా తీయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో పాత శిలాఫలకాలను మార్చి కొత్త శిలాఫలకాలు పెట్టి, కొత్త శంకుస్థాపనల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

ఈ రెండేళ్లలో మున్సిపాలిటీకి ఏం చేశారో చెప్పే ధైర్యం ఉంటే శ్వేతపత్రం విడుదల చేసి ఎన్నికలకు రావాలని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. డంపింగ్ యార్డు విషయంలో కూడా స్థానిక ఎమ్మెల్యే ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో డంపింగ్ యార్డు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఎలాంటి తీర్మానం కూడా చేయలేదని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవ్వాలంటే కేసీఆర్ ఆశయాలతో ముందుకు సాగుతున్న బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

Sthanikam

కెసిఆర్ హయాంలోనే నిజమైన అభివృద్ధి శివనేని గూడెంలో చిరుమర్తి లింగయ్య ప్రచారం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News