Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:29 AM

క్యాలెండర్ ఆవిష్కరణ వేదికగా ఉపాధ్యాయ సమస్యలపై PRTU TS గళం

08-01-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రధాన ప్రతినిధి

PRTU TS రామన్నపేట మండల శాఖ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం రామన్నపేట మండల వనరుల కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి గవ్వజ్యోతి హాజరయ్యారు.

ప్రధాన అతిథిగా పాల్గొన్న PRTU TS యాదాద్రి భువనగిరి జిల్లా సమన్వయ కమిటీ చైర్మన్ భీమిడి ఉపేందర్ జీ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధి కోల్పోయిందని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, అలాగే రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యూటీ, కమ్యూటేషన్ బకాయిలు, సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ చొక్కారపు విజయకుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులపై అనవసర ఒత్తిడిని తగ్గించాలని, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.మండల శాఖ అధ్యక్షుడు కైరోజు లింగాచారి, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహీం మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని, ఉపాధ్యాయుల హెల్త్ కార్డులపై ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు శ్రీనివాస్ రెడ్డి, భాస్కరాచారి, శ్రీనివాసరావు, మండల బాధ్యులు అబ్దుల్ ఖయ్యాం, లింగస్వామి, మణి, సీనియర్ సభ్యులు వెంకటేశం, ఆనంద్, మహేష్, అజీజ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

క్యాలెండర్ ఆవిష్కరణ వేదికగా ఉపాధ్యాయ సమస్యలపై PRTU TS గళం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News