Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:04 PM

కరెంట్ తీగ తాకి కల్లుగీత కార్మికుడు మృతి

16-01-2026 392 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం

వరంగల్, (పరకాల నియోజకవర్గం):

తాడి చెట్టు కమ్మ కోస్తున్న సమయంలో కరెంట్ తీగ తాకి కల్లుగీత కార్మికుడు పంతంగి రాజు గౌడ్ (ఆశాలపల్లి గ్రామం, సంగెం మండలం) మృతి చెందడం అత్యంత విషాదకరమని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే మృతి చెందిన రాజు గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస మానవత్వం లేకుండా దహన సంస్కారాల ఖర్చు, గాయపడిన కార్మికుల వైద్య ఖర్చులను కూడా నిలిపివేయడం దుర్మార్గమని తీవ్రంగా విమర్శించారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి మృతి చెందిన కల్లుగీత కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని పరిహారాలను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. కల్లు గీత కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నా, వారి సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని అన్నారు.కల్లుగీత కార్మికులు, గౌడల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ గౌడల పట్ల చిన్నచూపు, కక్షపూరిత వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. దీనికి నిరసనగా త్వరలో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లను కలిసి సమస్యలను వివరించనున్నట్లు తెలిపారు.ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదని గుండాల మల్లేష్ గౌడ్ స్పష్టం చేశారు.

Sthanikam

కరెంట్ తీగ తాకి కల్లుగీత కార్మికుడు మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News