Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:53 PM

క్రాస్ కంట్రీలో రామన్నపేట డిగ్రీ కళాశాల దూసుకుపోరు – యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానం

21-01-2026 145 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విశేష గౌరవం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం

మహాత్మా గాంధీ యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ కాలేజీ క్రాస్ కంట్రీ రేస్ పోటీల్లో రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ ప్రదర్శించి ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి కళాశాలకే కాకుండా యాదాద్రి భువనగిరి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.

ఈ పోటీల్లో కళాశాల తరఫున సునీల్, నీలవేణి, నవీన్, మోటే నవీన్, రాజు, పి. నవీన్, సాయి తేజలు పాల్గొని విశేష ప్రతిభ కనబరిచారు. వీరిలో సునీల్, నవీన్‌లు మహాత్మా గాంధీ యూనివర్సిటీ తరపున ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రాస్ కంట్రీ రేస్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక కావడం విశేషం.ఈ సందర్భంగా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య అల్తాఫ్ హుస్సేన్ విజేత విద్యార్థులకు మెమొంటోలు బహూకరించి అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా మెరుగైన ప్రతిభ కనబరిచి యూనివర్సిటీకి మరింత గుర్తింపు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం. రవీందర్ రావు విద్యార్థులను అభినందిస్తూ, యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించడం కళాశాల చరిత్రలో గర్వకారణమని పేర్కొన్నారు.

Sthanikam

క్రాస్ కంట్రీలో రామన్నపేట డిగ్రీ కళాశాల దూసుకుపోరు – యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News