Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:55 AM

క్రాస్ కంట్రీ రేసులో హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సత్తా

20-01-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అంతర్‌కళాశాల క్రాస్ కంట్రీ రేసులో అద్భుత ప్రతిభను చాటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సింథటిక్ ట్రాక్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో కళాశాల విద్యార్థులు టీమ్ ఛాంపియన్‌షిప్ స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించారు.

ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన బాలుర జట్టు టీమ్ ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఎన్. ధోని (బి.ఏ. ద్వితీయ సంవత్సరం) జట్టు నాయకత్వం వహించగా, బి. అరవింద్ (బి.ఎస్సీ. ద్వితీయ సంవత్సరం), పవన్ (బి.కామ్ ప్రథమ సంవత్సరం), భాను (బి.కామ్ ప్రథమ సంవత్సరం) సభ్యులుగా పాల్గొన్నారు.

అదే విధంగా బాలికల జట్టు టీమ్ ఛాంపియన్‌షిప్‌లో మూడో స్థానాన్ని సాధించి కళాశాల ఖ్యాతిని పెంచింది. సౌమ్య (బి.కామ్ ప్రథమ సంవత్సరం), బిందు (బి.ఎస్సీ. ప్రథమ సంవత్సరం), సింధు (బి.ఎస్సీ. ప్రథమ సంవత్సరం), నందిని (బి.ఏ. ప్రథమ సంవత్సరం), తేజ శ్రీ (బి.కామ్ ద్వితీయ సంవత్సరం) జట్టు సభ్యులుగా రాణించారు.

విద్యార్థుల విజయాలపై కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ బాబు అభినందనలు తెలిపారు. వారి క్రమశిక్షణ, అంకితభావమే ఈ ఫలితాలకు కారణమని పేర్కొన్నారు. ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అనిత మాట్లాడుతూ, ఎన్. ధోని జనవరి 24, 2026న జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరగనున్న 60వ ఓపెన్ నేషనల్ క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైనట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అనితతో పాటు అధ్యాపక బృందం విద్యార్థులను ఘనంగా అభినందించింది.

Sthanikam

క్రాస్ కంట్రీ రేసులో హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సత్తా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News