Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:01 PM

కామినేని ఫ్లైఓవర్ వద్ద అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి రెండు లారీలు స్వాధీనం డ్రైవర్లు అదుపులోకి

23-02-2026 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్‌పల్లి మండల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలను పోలీసులు సోమవారం ఉదయం పట్టుకున్నారు.ఈ రోజు ఉదయం సుమారు 6 గంటల సమయంలో నార్కట్‌పల్లి ఎస్సై పి. విష్ణుమూర్తికి నమ్మదగిన సమాచారం అందడంతో, ఆయన సిబ్బందితో కలిసి నార్కట్‌పల్లి గ్రామ శివారులోని కామినేని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ వైపు అక్రమంగా, అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను గుర్తించారు. వాటి నంబర్లు TG07T4554, TS07UH4554గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అవసరమైన రవాణా అనుమతులు లేకపోవడంతో రెండు లారీలను స్వాధీనం చేసుకుని, వాటి డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.తదుపరి చర్యల నిమిత్తం లారీలు మరియు డ్రైవర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై ఎస్సై పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

Sthanikam

కామినేని ఫ్లైఓవర్ వద్ద అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి రెండు లారీలు స్వాధీనం డ్రైవర్లు అదుపులోకి

Article Image

నార్కట్‌పల్లి మండల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలను పోలీసులు సోమవారం ఉదయం పట్టుకున్నారు.ఈ రోజు ఉదయం సుమారు 6 గంటల సమయంలో నార్కట్‌పల్లి ఎస్సై పి. విష్ణుమూర్తికి నమ్మదగిన సమాచారం అందడంతో, ఆయన సిబ్బందితో కలిసి నార్కట్‌పల్లి గ్రామ శివారులోని కామినేని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ వైపు అక్రమంగా, అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను గుర్తించారు. వాటి నంబర్లు TG07T4554, TS07UH4554గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అవసరమైన రవాణా అనుమతులు లేకపోవడంతో రెండు లారీలను స్వాధీనం చేసుకుని, వాటి డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.తదుపరి చర్యల నిమిత్తం లారీలు మరియు డ్రైవర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై ఎస్సై పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News