Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:29 AM

కమ్యూనిస్టుల ఐక్యత దేశానికి అవసరం: కే. శ్రీనివాసరెడ్డి

07-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజల పక్షాన నిలిచిన పార్టీలే కమ్యూనిస్టులు – సిపిఐ శతాబ్ది ఉత్సవాల సెమినార్‌లో వ్యాఖ్యలు

స్థానికం ప్రధాన ప్రతినిధి

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీల ఐక్యత దేశానికి అత్యవసరమని తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కే. శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని లయన్స్‌క్లబ్‌లో సిపిఐ వందేళ్ల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన “కమ్యూనిస్టుల ఐక్యత – నేటి అవసరం” అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా కే. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కమ్యూనిస్టుల ఐక్యత అనివార్యమైందని అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య శక్తిగా కమ్యూనిస్టులు నిలిచారని గుర్తు చేశారు. సిపిఐ చీలికతో ప్రజాస్వామ్య శక్తుల బలం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీజేపీ ఇతర పార్టీల మద్దతుపైనే ఆధారపడి కొనసాగుతోందని విమర్శించారు. బీజేపీ పతనం సమీపంలో ఉందని వ్యాఖ్యానించారు.సిపిఐ వందేళ్ల చరిత్ర ప్రజా పోరాటాలకు ప్రతీకగా నిలిచిందని, స్వాతంత్ర్య ఉద్యమం నుంచి రైతు, కార్మిక ఉద్యమాల వరకూ కమ్యూనిస్టుల పాత్ర అపూర్వమని ఆయన కొనియాడారు. రాబోయే ఖమ్మం శతాబ్ది సభలో లక్షలాది మంది పాల్గొని ఫాసిస్టు పాలనకు చెక్‌ పెట్టాలని పిలుపునిచ్చారు.అనంతరం మాట్లాడిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు బీజేపీ “ఆపరేషన్‌ కగార్” పేరుతో కమ్యూనిస్టుల గొంతుకలను అణచివేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆలోచనల స్వేచ్ఛను కట్టడి చేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రజా ఉద్యమాలే దేశానికి ఆశాకిరణాలు చూపగలవని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు బి. అజయ్‌ సారధి రెడ్డి, నల్లు సుధాకర్‌ రెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్‌, ప్రజాపక్షం జిల్లా స్టాపర్‌ కల్లూరి ప్రభాకర్‌, టీఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఉదయధీర్‌, 143 జిల్లా కన్వీనర్‌ గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కమ్యూనిస్టుల ఐక్యత దేశానికి అవసరం: కే. శ్రీనివాసరెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News