Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:25 AM

కేసీఆర్ కోటలో కాంగ్రెస్ హవా

కేసీఆర్ కోటలో కాంగ్రెస్ హవా

కేసీఆర్ కోటలో కాంగ్రెస్ హవా
07-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మెజార్టీ గ్రామాల్లో కాంగ్రెస్ జయకేతనం – సర్పంచ్‌లకు ఘన సన్మానం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యం చాటిందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మెజార్టీ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడం పార్టీ శ్రేణుల సమిష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.బుధవారం మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్ధిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన మన్నె కళ్యాణ్, గజ్వెల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తో కలిసి చిట్కుల్‌లోని ఎన్‌ఎంఆర్ కార్యాలయంలో నీలం మధు ముదిరాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా విజయం సాధించిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డ్ సభ్యులను నీలం మధు ముదిరాజ్ అభినందించి ఘనంగా సత్కరించారు. గజ్వెల్‌లో కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమనే నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సహా పార్టీ శ్రేణుల కృషి మరువలేనిదని కొనియాడారు.గ్రామాల్లో ప్రజలు చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేసి సమగ్ర అభివృద్ధి దిశగా పనిచేయాలని సర్పంచ్‌లకు సూచించారు.ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ గ్రామ సర్పంచ్ భాస్కర్ యాదవ్, జీడిపల్లి గ్రామ సర్పంచ్ నర్సన్నగారి కృష్ణ, కొండాపూర్ గ్రామ సర్పంచ్ నూకల రాము, వెంకటాపూర్ అగ్రహారం గ్రామ సర్పంచ్ వెంకటేష్, గౌతజిగూడా గ్రామ సర్పంచ్ నాగరాజు, ఉపసర్పంచ్ ఎర్ర నాగరాజు, ఇతర సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కేసీఆర్ కోటలో కాంగ్రెస్ హవా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News