Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:42 AM

కాస్మోటిక్స్ పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్

24-12-2025 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కష్టపడే కార్మికుల సంక్షేమమే లక్ష్యం

పారిశుద్ధ్య కార్మికులకు కాస్మోటిక్స్ పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్

స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ పట్టణంలో పారిశుద్ధ్య పనులతో పట్టణాన్ని శుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ ఆత్మీయంగా చేయూత అందించారు. మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కాస్మోటిక్స్ సామాగ్రిని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కార్మికులకు సబ్బులు, సర్ఫ్‌లు, బెల్లం తదితర నిత్యావసర వస్తువులు అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ— పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించే కార్మికుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపాలిటీదేనని పేర్కొన్నారు.

పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన సామాగ్రిని అందించడం ఆనవాయితీగా కొనసాగుతోందని శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కఠిన పరిస్థితుల్లో పని చేసే కార్మికులకు కాస్మోటిక్స్ వంటి అవసరమైన వస్తువులు తప్పనిసరిగా అందించాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంతో కార్మికుల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ కష్టాన్ని గుర్తించి సహాయం చేసిన మున్సిపల్ అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

కాస్మోటిక్స్ పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News