Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:07 AM

కాపురం కాపాడాలని కలెక్టర్‌ను ఆశ్రయించిన యువకుడు

08-01-2026 248 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భార్యను విడదీయొద్దు… గర్భాన్ని తొలగించొద్దు

ప్రేమ వివాహంపై ప్రతీకారం?

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

తన కుటుంబాన్ని విడదీయొద్దని, భార్య గర్భాన్ని తొలగించవద్దని, తన కాపురాన్ని నిలబెట్టి న్యాయం చేయాలని కోరుతూ ఓ యువకుడు జిల్లా అధికారులను ఆశ్రయించాడు. జనగాం జిల్లా కొడకండ్ల మండలం రామారం గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి సందీప్ గురువారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా వైద్యాధికారి మనోహర్, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి నర్సింహారావులకు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు.సందీప్ తెలిపిన వివరాల ప్రకారం… యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన దివ్య పూజతో 2024 నుంచి ప్రేమలో ఉన్నారు. ఇరువర్గాల పెద్దలు ఈ ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో గత ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని ఆర్య సమాజంలో స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అనంతరం మే నెలలో సందీప్ తల్లిదండ్రులు ఈ వివాహాన్ని అంగీకరించి రామారం గ్రామంలోని ఫంక్షన్ హాల్లో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించారు.పెళ్లి అనంతరం దంపతులు గత ఎనిమిది నెలలుగా హైదరాబాద్‌లో కాపురం ఉంటున్నారు. సందీప్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం దివ్య పూజ ఐదు నెలల గర్భవతిగా ఉన్నట్టు తెలిసింది. ఇటీవల క్రిస్మస్ పండుగ సందర్భంగా భార్యను భువనగిరిలోని తన పెద్దమ్మ మేడి జయంతి ఇంటివద్ద వదిలివచ్చానని సందీప్ తెలిపారు.అయితే ప్రేమ వివాహం మొదటి నుంచే ఇష్టం లేని భార్య తరపు బంధువులు — తల్లి, పెద్దమ్మ, చిన్నమ్మ — దివ్య పూజ మనసు మార్చి గర్భస్రావానికి ప్రయత్నాలు చేస్తున్నారని, తనపై విడాకులు ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారని సందీప్ ఆరోపించారు. ఇది తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని పేర్కొన్నారు.జిల్లా అధికారులు వెంటనే స్పందించి తన భార్య గర్భాన్ని కాపాడాలని, తన కాపురాన్ని నిలబెట్టాలని, భార్యను తనతో కలిసి జీవించేలా సహకరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

Sthanikam

కాపురం కాపాడాలని కలెక్టర్‌ను ఆశ్రయించిన యువకుడు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News