Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:17 PM

కాంగ్రెస్ 141వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా.. ఉపాధిహామీ పేరు మార్పుకు నిరసన

28-12-2025 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచిలో కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవం

ఖమ్మం:స్థానిక ప్రతినిధి జనార్ధన్:

భారత జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని కూసుమంచి మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో ఘనంగా నిర్వహించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ హఫీజుద్దీన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో కూసుమంచి గ్రామ సర్పంచ్ కొండా కృష్ణవేణి, ఉప సర్పంచ్ చెన్ను వెంకటరమణ, యువజన నాయకులు బెల్లంకొండ శరత్‌కుమార్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి సర్పంచులు, వార్డు సభ్యులు హాజరయ్యారు.

కార్యక్రమానికి ముందు ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచులు, వార్డు సభ్యులను మూడు రంగుల కండువాలతో సన్మానించి అభినందించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఉపాధిహామీ పథకం పేరు మార్పుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Sthanikam

కాంగ్రెస్ 141వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా.. ఉపాధిహామీ పేరు మార్పుకు నిరసన

Article Image

కూసుమంచిలో కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవం

ఖమ్మం:స్థానిక ప్రతినిధి జనార్ధన్:

భారత జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని కూసుమంచి మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో ఘనంగా నిర్వహించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ హఫీజుద్దీన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో కూసుమంచి గ్రామ సర్పంచ్ కొండా కృష్ణవేణి, ఉప సర్పంచ్ చెన్ను వెంకటరమణ, యువజన నాయకులు బెల్లంకొండ శరత్‌కుమార్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి సర్పంచులు, వార్డు సభ్యులు హాజరయ్యారు.

కార్యక్రమానికి ముందు ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచులు, వార్డు సభ్యులను మూడు రంగుల కండువాలతో సన్మానించి అభినందించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఉపాధిహామీ పథకం పేరు మార్పుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News