Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:13 AM

జిల్లా ఎస్పీకి ఎస్సీ–ఎస్టీ–బీసీ సంఘాల వినతిపత్రం

11-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపల్–జడ్పిటిసి–ఎంపిటిసి ఎన్నికల నేపథ్యంలో

పోలీస్ పికెట్ల ఏర్పాటు చేయాలి

భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

జిల్లాలో త్వరలో జరగనున్న మున్సిపల్, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు శాంతియుతంగా, న్యాయంగా నిర్వహించేందుకు అన్ని ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని ఎస్సీ–ఎస్టీ–బీసీ సంఘాల నాయకులు జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్‌ను కోరారు. ఈ మేరకు శనివారం భువనగిరిలో జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.రాచకొండ కమిషనరేట్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీ హోదా రావడం సందర్భంగా జిల్లా ఎస్పీని సంఘ నాయకులు సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే పోలీస్ యంత్రాంగం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మున్సిపల్ కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో 24 గంటలు పనిచేసేలా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో ప్రజలు భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్యాట్రోలింగ్ పెంచి భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు.కొన్ని ప్రాంతాల్లో కుల, రాజకీయ ఆధిపత్యాలు అధికంగా ఉన్నాయని, వాటిని నియంత్రించి ఆధిపత్య రాజకీయాలకు గట్టి అడ్డుకట్ట వేయాలని సూచించారు. నామినేషన్లు వేయకుండా బెదిరింపులు, కిడ్నాప్ హెచ్చరికలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనిడిమాండ్ చేశారు.ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మందు, డబ్బు పంపిణీ వంటి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా కట్టడి చేయాలని, సమాచారం అందిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలపై దాడులు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని కోరారు.ప్రజాసేవపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనలేకుండా ఎన్నికల్లో పాల్గొనే విధంగా పోలీస్ శాఖ భరోసా కల్పించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, సామాజికవేత్త బట్టు రామచంద్రయ్య, బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుండెబోయిన సురేష్, బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జిల్లా ఎస్పీకి ఎస్సీ–ఎస్టీ–బీసీ సంఘాల వినతిపత్రం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News