Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:20 AM

జీవో నం.7పై ఆగ్రహం: పేద విద్యార్థుల పాలిట డెత్ వారెంట్ అంటున్న బీఆర్‌ఎస్‌వీ నేతలు

03-05-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ నియోజకవర్గంలో జీవో నంబర్ 7పై విద్యార్థి సంఘాల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. బీఆర్‌ఎస్‌వీ మాజీ నియోజకవర్గ అధ్యక్షుడు జెట్టి శివ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 7 పేద విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని తీవ్రంగా విమర్శించారు.

ఆయన మాటల్లో, “ముందు ఫీజు కట్టండి – తర్వాత ప్రభుత్వం చెల్లిస్తుంది అంటున్నారు. తిండికే ఇబ్బంది పడే పేద విద్యార్థులు వేల రూపాయలు ముందుగానే ఎలా సమకూర్చుకుంటారు?” అని ప్రశ్నించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని క్రమంగా ఎత్తివేయడానికి ఇదొక కుట్రగా కనిపిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే ఫీజులు చెల్లించలేక సుమారు 14 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లోనే నిలిచిపోయాయని తెలిపారు.

ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడటం సరైంది కాదని, విద్యార్థుల ఆశలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 7ను తక్షణమే రద్దు చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

విద్యార్థి సంఘాలు హెచ్చరిక:

జీవోను రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి.

Sthanikam

జీవో నం.7పై ఆగ్రహం: పేద విద్యార్థుల పాలిట డెత్ వారెంట్ అంటున్న బీఆర్‌ఎస్‌వీ నేతలు

Article Image

నకిరేకల్ నియోజకవర్గంలో జీవో నంబర్ 7పై విద్యార్థి సంఘాల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. బీఆర్‌ఎస్‌వీ మాజీ నియోజకవర్గ అధ్యక్షుడు జెట్టి శివ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 7 పేద విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని తీవ్రంగా విమర్శించారు.

ఆయన మాటల్లో, “ముందు ఫీజు కట్టండి – తర్వాత ప్రభుత్వం చెల్లిస్తుంది అంటున్నారు. తిండికే ఇబ్బంది పడే పేద విద్యార్థులు వేల రూపాయలు ముందుగానే ఎలా సమకూర్చుకుంటారు?” అని ప్రశ్నించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని క్రమంగా ఎత్తివేయడానికి ఇదొక కుట్రగా కనిపిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే ఫీజులు చెల్లించలేక సుమారు 14 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లోనే నిలిచిపోయాయని తెలిపారు.

ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడటం సరైంది కాదని, విద్యార్థుల ఆశలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 7ను తక్షణమే రద్దు చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

విద్యార్థి సంఘాలు హెచ్చరిక:

జీవోను రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News