Sthanikam - Truth Matters
Logo

జీతాలు లేక పనికి రాని సిబ్బంది… స్వయంగా ట్రాక్టర్ నడిపి చెత్త సేకరించిన సర్పంచ్

Updated : 17 Mar 2026 09:15 IST
As Preferred Source 1 min read
జీతాలు లేక పనికి రాని సిబ్బంది… స్వయంగా ట్రాక్టర్ నడిపి చెత్త సేకరించిన సర్పంచ్

చిట్యాల మండలం, బోయగుబ్బ

గ్రామంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూసేందుకు బోయగుబ్బ గ్రామ సర్పంచ్ రేగులగడ్డ స్వామి గౌడ్ స్వయంగా ముందుకు వచ్చి ట్రాక్టర్ నడిపి చెత్త సేకరించారు. గత ఐదు నెలలుగా గ్రామపంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో వారు విధులకు హాజరు కావడం లేదు.

గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌కు కూడా జీతం అందకపోవడంతో ఆయన కూడా పనికి రావడం మానేశారు. దీంతో గ్రామంలో చెత్త పేరుకుపోయి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే పరిస్థితి ఏర్పడింది.ఈ పరిస్థితిని గమనించిన సర్పంచ్ రేగులగడ్డ స్వామి గౌడ్ స్వయంగా ట్రాక్టర్ నడిపి గ్రామంలోని వీధి వీధికి వెళ్లి చెత్తను సేకరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన తీసుకున్న ఈ చర్యను గ్రామస్థులు అభినందించారు.

గ్రామంలో పారిశుద్ధ్యాన్ని కాపాడటానికి సర్పంచ్ స్వయంగా ముందుకురావడంఆదర్శప్రాయమని స్థానికులు పేర్కొన్నారు. అలాగే పంచాయతీ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న జీతాలు త్వరగా చెల్లించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Sthanikam

జీతాలు లేక పనికి రాని సిబ్బంది… స్వయంగా ట్రాక్టర్ నడిపి చెత్త సేకరించిన సర్పంచ్

Article Image

చిట్యాల మండలం, బోయగుబ్బ

గ్రామంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూసేందుకు బోయగుబ్బ గ్రామ సర్పంచ్ రేగులగడ్డ స్వామి గౌడ్ స్వయంగా ముందుకు వచ్చి ట్రాక్టర్ నడిపి చెత్త సేకరించారు. గత ఐదు నెలలుగా గ్రామపంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో వారు విధులకు హాజరు కావడం లేదు.

గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌కు కూడా జీతం అందకపోవడంతో ఆయన కూడా పనికి రావడం మానేశారు. దీంతో గ్రామంలో చెత్త పేరుకుపోయి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే పరిస్థితి ఏర్పడింది.ఈ పరిస్థితిని గమనించిన సర్పంచ్ రేగులగడ్డ స్వామి గౌడ్ స్వయంగా ట్రాక్టర్ నడిపి గ్రామంలోని వీధి వీధికి వెళ్లి చెత్తను సేకరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన తీసుకున్న ఈ చర్యను గ్రామస్థులు అభినందించారు.

గ్రామంలో పారిశుద్ధ్యాన్ని కాపాడటానికి సర్పంచ్ స్వయంగా ముందుకురావడంఆదర్శప్రాయమని స్థానికులు పేర్కొన్నారు. అలాగే పంచాయతీ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న జీతాలు త్వరగా చెల్లించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news