Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:35 AM

జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో చెక్కుల పంపిణీ

12-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిరివెనికుంట గ్రామంలో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బోనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబు రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం బోనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామానికి చెందిన పలువురికి ఆర్థిక సహాయం అందజేశారు. రావుల దేవేందర్‌కు రూ.60,000, రావుల వరమ్మకు రూ.60,000, బొర్రా మంజులతకు రూ.48,000 విలువైన చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గ్రామంలోని శిథిలావస్థకు చేరుకున్న అంగన్‌వాడీ భవనాన్ని పరిశీలించిన రేఖ బాబు రావు, కొత్త భవనం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్, మాజీ ఎం.పీ.టి.సీ సభ్యులు గడ్డమీది చంద్రకళ వీరస్వామి గౌడ్, మండల అధ్యక్షుడు కనుకుంట్ల కొండల్, వార్డు సభ్యుడు సందెల మహేష్, చిన్నపాక బాలస్వామి, కొండ అశోక్ రెడ్డి, ఉపసర్పంచ్ ప్రభాకర్, గోపాల్, కృష్ణ, ప్రసాద్ తదితరులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో చెక్కుల పంపిణీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News