Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:36 PM

జాతీయ పతాకానికి అవమానం… అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు

జాతీయ పతాకానికి అవమానం… అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు

జాతీయ పతాకానికి అవమానం… అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు
27-01-2026 321 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిర్లక్ష్యానికి నిలువుటద్దం

రామన్నపేట, స్థానిక ప్రధాన ప్రతినిధి:

జాతీయ పతాకం విషయంలో చోటుచేసుకున్న నిర్లక్ష్యం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. రామన్నపేట మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంక్ కార్యాలయం ఎదుట జాతీయ జెండా మధ్యలోనే జారి నిలిచిన ఘటన కలకలం రేపింది.గణతంత్ర వేడుకల సందర్భంగా జెండా ఎగురవేసిన అధికారులు పతాకాన్ని పట్టిష్టంగా కట్టడంలో విఫలమవడంతో, మధ్యాహ్నం సమయానికి జెండా కర్ర మధ్యభాగానికి జారింది. జాతీయ గౌరవ చిహ్నమైన త్రివర్ణ పతాకం ఈ విధంగా అవమానానికి గురవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు.

ప్రభుత్వ కార్యాలయం ఎదుటే ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి బాధ్యత వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ పతాక గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారే ఇలా నిర్లక్ష్యం చూపడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Sthanikam

జాతీయ పతాకానికి అవమానం… అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News