Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 07:25 PM

జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం అర్హులకూ అక్రిడేషన్ లేదు: షానూర్

24-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షానూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోత్కూరు మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులపై జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు.

పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో జర్నలిస్టులకు న్యాయం దక్కకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే కొనసాగుతున్నాయని, ప్రభుత్వ హామీలు కాగితాలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు.అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు చెల్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జర్నలిస్టులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని స్పష్టం చేశారు.

జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో టీజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి. కాజా పసియుద్దీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు నరేశ్, మోత్కూరు మండల అధ్యక్షులు సోమన్న చారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం అర్హులకూ అక్రిడేషన్ లేదు: షానూర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News