Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:23 PM

జనవరి 24న ‘చలో కోదాడ’ను విజయవంతం చేయాలి : బీఆర్ఎస్ నేతల పిలుపు

20-01-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కోదాడ/నల్లగొండ స్థానికం ప్రధాన ప్రతినిధి

కర్ల రాజేష్ మృతి పోలీసు దౌర్జన్యానికి ప్రత్యక్ష నిదర్శనమని ఆరోపిస్తూ, ఈ ఘటనకు బాధ్యులైన చిలుకూరు ఎస్సైతో పాటు సంబంధిత పోలీసు అధికారులపై తక్షణమే క్రిమినల్ చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. పోలీసు కస్టడీ మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడాలని, కాంగ్రెస్ పాలనలో పోలీస్ రాజ్యం కొనసాగుతోందని తీవ్రంగా విమర్శించారు.ఈ మేరకు జనవరి 24న నిర్వహించనున్న “చలో కోదాడ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు కస్టడీలో కర్ల రాజేష్ అనుమానాస్పద మృతి ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచిన ఘటనగా పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం మౌనం పాటించడం, బాధ్యులైన అధికారులను రక్షించే ప్రయత్నాలు చేయడం అత్యంత ఖండనీయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ, నిరపరాధులపై అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందని ఆరోపించారు.బాధ్యుల్ని కాపాడే ప్రయత్నాల్లో స్థానిక ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్ పాత్ర ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని విమర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం, తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని, పోలీసు దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రజల ఐక్య పోరాటమే పరిష్కారమని నేతలు స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నేతృత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం “చలో కోదాడ” కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రజలు, ప్రజాసంఘాలు, యువజనులు, మహిళలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మండల నాయకులు ముత్తవరపు రమేష్, పొట్టా విజయ కిరణ్, గుడిపూడి శ్రీకాంత్, బట్టు కోటేశ్వరరావు, షేక్ అబ్దుల్ నభీ, యరమాల శ్రీను, పోట్ల సతీష్, నల్లపాటి శ్రీనివాసరావు, పర్స హరి, పోతుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జనవరి 24న ‘చలో కోదాడ’ను విజయవంతం చేయాలి : బీఆర్ఎస్ నేతల పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News