Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:50 PM

జనవరి 24 బంద్‌లో పాల్గొంటాం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

22-01-2026 154 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని జిల్లా ఉద్యమానికి పత్తికొండలో మద్దతు

పత్తికొండ, స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు జనవరి 24న నిర్వహించనున్న అయిదు నియోజకవర్గాల బంద్‌కు పూర్తి మద్దతు ఇస్తామని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప్రకటించారు. బంద్‌లో తాము కూడా పాల్గొంటామని వెల్లడించటం ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చిందని జేఏసి నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా జేఏసి నాయకులు నూర్ తదితరులు పత్తికొండలో శ్రీదేవి నివాసానికి వెళ్లి బంద్‌కు మద్దతు కోరగా, ఆమె సానుకూలంగా స్పందించారు. ఆదోని జిల్లా సాధన కోసం గత 70 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని శ్రీదేవి వ్యాఖ్యానించారు.ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదోని జిల్లాను ఏర్పాటు చేసి, అయిదు నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆమె హితవు పలికారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జేఏసి నాయకులు నూర్, అయ్యాళప్ప, షకీల్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జనవరి 24 బంద్‌లో పాల్గొంటాం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News