Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

జన్మదినానికి కొత్త అర్థo హెల్మెట్-పూల మొక్కతో శుభాకాంక్షలు

06-03-2026 332 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రోడ్డు భద్రతపై అవగాహనకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ సుందర్

చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో జన్మదిన వేడుకలకు కొత్త అర్థం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తపడాలని గ్రామ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

మాజీ వార్డ్ మెంబర్ హెచ్. స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు హెల్మెట్‌తో పాటు పూల మొక్కను అందజేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇకపై గ్రామంలో ఎవరి జన్మదినమైనా వారికి హెల్మెట్ మరియు ఒక పూల మొక్కను అందజేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సర్పంచ్ ఆవుల సుందర్ తెలిపారు. రోడ్డు భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంఘాల అధ్యక్షురాలు ఆవుల మాధవి సుందర్, సామాజిక కార్యకర్త పొలిమేర దశరథ, కాంగ్రెస్ నాయకులు పొలిమేర శంకర్, ఇతర ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

జన్మదినానికి కొత్త అర్థo హెల్మెట్-పూల మొక్కతో శుభాకాంక్షలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News