Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:39 AM

ఇంటర్ ఫలితాల్లో ఎస్‌ఆర్ ప్రభంజనం – రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంకులు

12-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ,

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్లగొండలోని ఎస్‌ఆర్ కాలేజీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో అత్యున్నత మార్కులు సాధించి టాప్ ర్యాంకులు దక్కించుకున్నారు.

ఎంపీసీ ఫస్ట్ ఇయర్‌లో జీలకుంట్ల నమిక, ఆకవరం శివాని విద్యార్థినులు 470కి 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. కొలగట్ల నవనీత (466), శీలం నిశాంత్, శ్రీ చరణ్, కొప్పు కృత్య, జోగు మధు కిషోర్ (465) మార్కులతో ప్రతిభ చూపారు.

బైపీసీ ఫస్ట్ ఇయర్‌లో పసుపులేటి కీర్తన 440కి 437 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా, కన్నెకంటి శ్రీనిధి (436), వేముల వికాస్ (434), మేక సౌమ్య (432) ఉత్తమ ఫలితాలు సాధించారు.

సెకండ్ ఇయర్‌లో

బైపీసీ: నర్సింగ్ సాయి కిరణ్ 1000కి 995 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంక్ పొందాడు. అలకుంట్ల అనూష (994) మెరిసింది.

ఎంపీసీ: ఎర్రమాద జ్ఞానేశ్వర్ 992 మార్కులతో ర్యాంక్ సాధించగా, వీరమళ్ల రమ్య (991), కాసర్ల శ్వేత (990), గంధమల్ల విష్ణు వర్ధన్ (988), పువటి సాయి ప్రతాప్ (987) ప్రతిభ కనబర్చారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఏనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి, అకాడమిక్ డీన్ భరత్ రెడ్డి, జోనల్ ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ మనోజ్ రెడ్డి మరియు అధ్యాపక బృందం అభినందించారు.

“క్రమశిక్షణ, పట్టుదలతో చదివితేనే విజయాలు సాధ్యమని ఎస్‌ఆర్ విద్యార్థులు మరోసారి నిరూపించారు” అని యాజమాన్యం పేర్కొంది.

Sthanikam

ఇంటర్ ఫలితాల్లో ఎస్‌ఆర్ ప్రభంజనం – రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంకులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News