Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:06 PM

ఇస్నాపూర్ 16వ వార్డులో బిఆర్ఎస్ తరఫున గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి బరిలోకి

17-01-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:పటాన్‌చెరు నియోజకవర్గంలో మున్సిపల్ రాజకీయాలు వేడెక్కుతున్న వేళ

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో మున్సిపల్ రాజకీయాలు చురుగ్గా మారుతున్నాయి.ఇస్నాపూర్ మున్సిపాలిటీ నుంచి 16వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్‌గా ప్రజాసేవ లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నారు.పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రోత్సాహంతో పాటు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులతో ఆమె ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నారు.స్థానిక సమస్యలపై అవగాహన, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వ లక్షణాలు గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డికి ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇస్నాపూర్ అభివృద్ధే లక్ష్యంగా,మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుధ్యం,తాగునీరు, రోడ్ల అభివృద్ధి వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగుతామని ఆమె స్పష్టం చేస్తున్నారు. ప్రజలతో నిత్యం మమేకమై పనిచేసే నాయకురాలిగా తనను తాను నిరూపించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్టు ఆమె సమీప వర్గాలు తెలిపాయి.ఇస్నాపూర్ 16వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి బరిలోకి రావడంతో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారిందని స్థానికంగా చర్చ జరుగుతోంది.

Sthanikam

ఇస్నాపూర్ 16వ వార్డులో బిఆర్ఎస్ తరఫున గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి బరిలోకి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News