Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:13 PM

ఇరవై ఆరు ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే బడి ప్రాంగణం. మధుర స్మృతులతో పూర్వ విద్యార్థుల పునర్మిళకం

25-01-2026 305 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అక్కినపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో మధుర స్మృతుల పునర్మిళకం

చిన్ననాటి జ్ఞాపకాలకు మళ్లీ ఊపిరి

పాఠశాల గడప దాటినా, అనుబంధం చెదరలేదు

స్థానికం ప్రధాన ప్రతినిధి

నార్కట్పల్లి మండలం అక్కినపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 1999–2000 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న విద్యార్థులు తమ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు, మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు.పాఠశాల ప్రాంగణం ఒకరోజు పాటు గతాన్ని గుర్తు చేసే జ్ఞాపకాలతో నిండిపోయింది. చదువు రోజుల్లోని సంఘటనలు, ఉపాధ్యాయుల శిక్షణ, సహపాఠులతో గడిపిన క్షణాలు ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురి చేశాయి. నవ్వులు, ఆనందం, అనుబంధం ఈ సమ్మేళనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి, అనంతరావ్ పాల్గొని పూర్వ విద్యార్థులను ఆశీర్వదించారు. విద్యార్థుల జీవితాల్లో పాఠశాల దశ ఎంత ముఖ్యమో గుర్తు చేస్తూ, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని వారు ఆకాంక్షించారు.పూర్వ విద్యార్థుల సమ్మేళనం తరచుగా నిర్వహిస్తూ పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్న సంకల్పాన్ని ఈ సందర్భంగా విద్యార్థులు వ్యక్తం చేశారు. అనుబంధాన్ని పునరుద్ధరించిన ఈ సమ్మేళనం అందరిలో చిరస్మరణీయంగా నిలిచింది.

Sthanikam

ఇరవై ఆరు ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే బడి ప్రాంగణం. మధుర స్మృతులతో పూర్వ విద్యార్థుల పునర్మిళకం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News