Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

ఇంపాక్ట్ రీజియన్–17 ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు

Updated : 13 Jan 2026 05:48 IST
As Preferred Source 1 min read
ఇంపాక్ట్ రీజియన్–17 ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజియన్–17, నారాయణఖేడ్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ రీజియన్–17కు చెందిన సభ్యులందరూ ఉత్సాహంగా, చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్వామి వివేకానంద భారత దేశ ఖ్యాతిని ప్రపంచమంతా చాటి చెప్పిన మహానుభావుడని, ఆయన ఆలోచనలు, బోధనలు నేటి యువతకు ఎంతో అవసరమని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు.ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో యువత సరైన దిశలో ఆలోచిస్తూ, నైపుణ్యపూర్వకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాంటి సమయంలో స్వామి వివేకానంద బోధనలు ప్రతి ఒక్కరి జీవితానికి ప్రేరణగా, మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. కష్టపడి పనిచేయడం, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధించడం వంటి విలువలను ఆయన బోధనలు యువతలో నాటుతాయని వివరించారు.యువత దేశ భవిష్యత్తు అని, వారిని ఉత్తమ మార్గంలో నడిపించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు. జాతీయ యువజన దినోత్సవాన్ని ఈ విధంగా ఘనంగా నిర్వహించడం ద్వారా యువతలో స్పూర్తి పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో రీజినల్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్, నారీ సెల్ డైరెక్టర్ శ్వేత, సర్వీస్ డైరెక్టర్ జ్యోతిర్లింగం, బిజినెస్ డైరెక్టర్ సుశాంత్, ఇంపాక్ట్ ట్రైనర్ సాయి బాబా, సారికతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంపాక్ట్ రీజియన్–17 ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news