Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వర్ధిల్లాలి: కలపాల వెంకటేశ్వరరావు

08-03-2026 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చాట్ల చిలకమ్మా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘం గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా చాట్ల చిలకమ్మా, కార్యదర్శిగా కలపాల జ్యోతి ఎంపిక కాగా సభ్యులుగా ఆడిమిల్లి ధనలక్ష్మి, ఆడిమిల్లి జ్యోతి, ఆడిమిల్లి విక్టోరియా, దేవరపల్లి శారమ్మ, దోనెల్లి విక్టోరియా, మొక్కలకత్తి లూసి, ఆరెల్లి దుర్గ, ఆరెల్లి రజని, పొగట్ల రాణి లను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం మహిళల హక్కుల కోసం సాగిన పోరాటాలకు ప్రతీక అని తెలిపారు. అమెరికాలో సుమారు 120 సంవత్సరాల క్రితం శ్రామిక మహిళలు అపరిమిత పనిగంటలు, తక్కువ వేతనాలు మరియు దారుణమైన పని పరిస్థితులకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల ఫలితంగానే మహిళా ఉద్యమాలు బలపడ్డాయని చెప్పారు. అనంతరం మహిళల ఓటు హక్కు మరియు సమానత్వం కోసం ఉద్యమాలు విస్తరించాయని, 1910లో కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్‌కిన్ మార్చి 8ను అంతర్జాతీయ మహిళా పోరాట దినంగా పాటించాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు.

దేశంలో మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు, హింస, అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు ఉన్న చట్టబద్ధ రక్షణలు, మౌలిక హక్కులు బలహీనపడుతున్నాయని విమర్శించారు. మహిళలకు సమాన వేతనం, ఉపాధి భద్రత, సామాజిక రక్షణ వంటి అంశాలు ప్రమాదంలో పడుతున్నాయని అన్నారు. అలాగే 8 గంటల పని దినాన్ని తగ్గిస్తూ అదనపు పనిగంటల భారాన్ని పెంచుతున్నారని పేర్కొన్నారు.

స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం అన్యాయమని తెలిపారు. నిత్యావసర వస్తువులు, వంటగ్యాస్ ధరలు పెరగడం వల్ల మహిళల జీవన పరిస్థితులు మరింత కష్టతరమవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని విమర్శించారు. గ్రామంలో స్మశాన భూమి కబ్జాను తొలగించి తిరిగి స్వాధీనపరచాలని, సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని, మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సహాయం అందించాలని, ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, 200 పని దినాలు కల్పించి రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం, సీసీ రోడ్లు నిర్మించడం, వీధి దీపాలు ఏర్పాటు చేయడం, సూక్ష్మ రుణాలను రద్దు చేయడం, మహిళలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని కోరారు.

మహిళలు తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు చాట్ల బాబురావు, మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు, చాట్ల చిలకమ్మా, కలపాల జ్యోతి, ఆడిమిల్లి జ్యోతి, ఆడి శారమ్మ, ఆడిమిల్లి విక్టోరియా, ఆడిమిల్లి ధనలక్ష్మి, మొక్కలకత్తి లూసి, దోనెల్లి విక్టోరియా, ఆరెల్లి రాణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వర్ధిల్లాలి: కలపాల వెంకటేశ్వరరావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News