Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 06:29 AM

ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల అఖండ విజయం..

ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల అఖండ విజయం..

ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల అఖండ విజయం..
April 12, 2026 08:09 PM 159 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులతో ప్రభంజనం..

నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్లగొండలోని ఎస్ఆర్ పీజేసీ బ్రాంచ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి స్టేట్ ర్యాంకులతో సత్తా చాటారు. అటు ప్రథమ సంవత్సరం, ఇటు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి విద్యాసంస్థల కీర్తిని రాష్ట్రస్థాయిలో ఇనుమడింపజేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సర ఎంపీసీ విభాగంలో జీలకుంట్ల నమిక, ఆకవరం శివానిలు 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు. అదే విభాగంలో కొలగట్ల నవనీత 466 మార్కులు సాధించగా, శీలం నిశాంత్, శ్రీ చరణ్, కొప్పు కృత్య, జోగు మధు కిషోర్ లు తలో 465 మార్కులతో మెరిసి తమ విద్వత్తును చాటారు.

అటు బైపీసీ ప్రథమ సంవత్సరంలో పసుపులేటి కిర్తన 440 మార్కులకు గాను 437 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. కన్నెకంటి శ్రీనిధి 436 మార్కులతో, వేముల వికాస్ 434 మార్కులతో, మేక సౌమ్య 432 మార్కులతో తమ ప్రతిభను చాటుకున్నారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లోనూ ఎస్ఆర్ విద్యార్థుల జోరు కొనసాగింది. బైపీసీ విభాగంలో నర్సింగ్ సాయి కిరణ్ 1000 మార్కులకు గాను 995 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకును సొంతం చేసుకున్నారు. అలకుంట్ల అనూష 994 మార్కులతో అద్భుతమైన స్కోరు సాధించారు. ఎంపీసీ విభాగంలో ఎర్ర మాద జ్ఞానేశ్వర్ 992 మార్కులతో సత్తా చాటగా, వీరమళ్ళ రమ్య 991 మార్కులతో, కాసర్ల శ్వేత 990 మార్కులతో ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. గంధమల్ల విష్ణు వర్ధన్ 988 మార్కులు, పువటి సాయి ప్రతాప్ 987 మార్కులతో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిలో నిలిచారు. రాష్ట్రస్థాయిలో ఘనవిజయం సాధించిన విద్యార్థులను ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఏనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల కఠోర శ్రమకు తోడు అధ్యాపక బృందం అందించిన మెరుగైన శిక్షణ యాజమాన్యం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని అకడమిక్ డీన్ భరత్ రెడ్డి, నల్లగొండ జోనల్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ మనోజ్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విజయోత్సవంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News