Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:07 AM

ఇందిరానగర్ రంగవల్లుల పోటీల్లో మహిళల ఉత్సాహం అభినందనీయం: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

12-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

భువనగిరి పట్టణం 23వ వార్డు ఇందిరానగర్‌లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు మహిళల ఉత్సాహంతో సందడిగా సాగాయి. కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో, స్థానిక మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక–ప్రదీప్ నేతృత్వంలో అరుంధతి యూత్ కమిటీ హాల్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది.

ఈ పోటీలకు హాజరైన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి, ప్రకృతి ప్రతిబింబించేలా అందంగా రూపొందించిన తీరు ప్రశంసనీయం అన్నారు. సంక్రాంతి సందర్భంగా నవధాన్యాలు, గొబ్బెమ్మలతో ముగ్గులు వేసి పూజలు నిర్వహించడం మన సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలే కేంద్రంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, వడ్డీ లేని రుణాలు, దసరా సందర్భంగా చీరల పంపిణీ వంటి పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతున్నాయని అన్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, పేర్ల నమోదు కార్యక్రమాలు త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.

ముగ్గుల పోటీల్లో మొత్తం 67 మంది మహిళలు పాల్గొనగా, ప్రధమ బహుమతి వద్దిగళ్ల చిట్టి ప్రసాద్, ద్వితీయ బహుమతి గోలి స్వాతి, తృతీయ బహుమతి జల్గం సౌమ్యకు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తీ, పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, కాంగ్రెస్ నాయకులు, వార్డు నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరానగర్ రంగవల్లుల పోటీల్లో మహిళల ఉత్సాహం అభినందనీయం: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News