Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:08 AM

ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ హనుమంతరావు

17-01-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హనుమపురం గ్రామంలో పూర్తి అయిన ఇండ్ల పరిశీలన

యాదాద్రి భువనగిరి, స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

చివరి దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు.శనివారం భువనగిరి మండలం హనుమపురం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్, అక్కడ పూర్తి అయిన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్, వివిధ దశల్లో పూర్తయిన పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులు సకాలంలో ఖాతాల్లో జమయ్యాయా లేదా అని వివరాలు సేకరించారు. మిగిలి ఉన్న పనులను కూడా వేగంగా పూర్తి చేసి, ఇండ్లలో నివాసానికి సిద్ధం కావాలని సూచించారు. అలాగే లబ్ధిదారుల కుటుంబ పరిస్థితులు, అవసరాలపై ఆరా తీశారు.ప్రభుత్వ పథకాల అమలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా సాగాలనే లక్ష్యంతో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ హనుమంతరావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News