Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 09:06 AM

ఇందిరా మహిళా శక్తితో కోటి మహిళలకు కోటి ఆశలు

ఇందిరా మహిళా శక్తితో కోటి మహిళలకు కోటి ఆశలు

ఇందిరా మహిళా శక్తితో కోటి మహిళలకు కోటి ఆశలు
January 18, 2026 03:26 PM 189 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇందిరా మహిళా శక్తితో మహిళలకు ఆర్థిక స్వావలంబన

జిల్లాలో వడ్డీ లేని రుణాల పంపిణీకి సన్నాహాలు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పట్టణాల్లోని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తోందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు.ఆదివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, మెప్మా సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వడ్డీ లేని రుణాల పంపిణీకి సంబంధించి అన్ని మున్సిపాలిటీల్లో తేది 19.01.2026 మరియు 20.01.2026 తేదీలలో భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మహిళా సంఘాలకు స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులు పంపిణీ జరిగేలా సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మున్సిపాలిటీ వారీగా వడ్డీ లేని రుణాలను ఈ విధంగా మంజూరు చేసినట్లు తెలిపారు.

ఆలేరు మున్సిపాలిటీలో 375 సంఘాలకు రూ.78.87 లక్షలు, భువనగిరిలో 1170 సంఘాలకు రూ.2.99 కోట్లు, చౌటుప్పల్‌లో 591 సంఘాలకు రూ.1.28 కోట్లు, మోత్కూరులో 318 సంఘాలకు రూ.61.33 లక్షలు, పోచంపల్లిలో 528 సంఘాలకు రూ.1.11 కోట్లు, యాదగిరిగుట్టలో 344 సంఘాలకు రూ.98.23 లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు.

అదేవిధంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి వివిధ బ్యాంకుల ద్వారా బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి సహకారంతో కూడా భారీగా రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. ఆలేరులో 179 సంఘాలకు రూ.15.29 కోట్లు, భువనగిరిలో 334 సంఘాలకు రూ.43.81 కోట్లు, చౌటుప్పల్‌లో 314 సంఘాలకు రూ.30.58 కోట్లు, మోత్కూరులో 106 సంఘాలకు రూ.10.48 కోట్లు, పోచంపల్లిలో 206 సంఘాలకు రూ.17.93 కోట్లు, యాదగిరిగుట్టలో 87 సంఘాలకు రూ.12.73 కోట్లు రుణాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు రామలింగం, అంజన్ రెడ్డి, శ్రీనివాస్, సతీష్, వెంకట్రామ్ రెడ్డి, లింగ స్వామి తదితరులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News