Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:40 AM

ఇంద్రపాలనగరం గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ.

13-04-2026 237 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్న పేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా గ్రామపంచాయతి ఆవరణలో అవగాహన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, కారులో సీట్ బెల్ట్ ధరించకపోతే కలిగే నష్టాలు, అలాగే మద్యం సేవించి వాహనం నడిపితే ఎదురయ్యే తీవ్రమైన ప్రమాదాల గురించి ప్రజలకు, ముఖ్యంగా యువతకు వివరించారు.

“మీ నిర్లక్ష్యం వల్ల మీ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి తీసుకురావద్దు” అని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ గారు సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు వరికుప్పల స్వామి, పుట్టల లక్ష్మమ్మ, చిన్నలచ్చి శంకరమ్మ, రేపాక పారిజాత యాదయ్య, కప్పల మంగమ్మతో పాటు గ్రామానికి చెందిన ప్రముఖులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ నల్ల మంజుల, వీబీకేలు విజయలక్ష్మి, చామంతి, హేమలత, అంగన్వాడీ సిబ్బంది మంజుల, రేణుక, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది జ్యోతి, అరుంధతి, శ్యామల, వసంత, వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరం గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News