Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:41 PM

హుజూర్‌నగర్‌లో అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర వేడుకలు

26-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాజ్యాంగానికి ఘన నివాళి

స్థానికం ప్రధాన ప్రతినిధి

భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ హుజూర్‌నగర్ పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కోర్టు ఆవరణలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గౌరవప్రదంగా సాగింది.

ఈ సందర్భంగా అంబేద్కర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు మీసాల శరత్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాణంలో చేసిన అపూర్వ సేవలను కొనియాడుతూ, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే మూల సూత్రాలపై ఆధారపడిన రాజ్యాంగం దేశ ప్రజలకు రక్షణ కవచంగా నిలుస్తోందని తెలిపారు.ఈ వేడుకల్లో పట్టణ సీనియర్ నాయకులు మాజీ జడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చింతిరాల నాగయ్య, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మీసాల కిరణ్ కుమార్, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు మంద నాగరాజు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మంద వెంకటేశ్వర్లు, ఐఎన్‌టీసీ నాయకులు మెల్లచెరువు ముక్కంటి పాల్గొని ప్రసంగించారు.అలాగే యాడవెల్లి వీరబాబు, దాసరి పున్నయ్య, గొట్టముక్కల రాములు, చంద్రయ్య, లచ్చయ్య, సైదులు, లక్ష్మణ్, వెంకట్, సురేష్, రవీంద్ర, రాము, వెంకటరామ్, మహేష్, నాగేష్, శ్రీను, రవి, ప్రేమ్, నరేందర్, ప్రవీణ్, సాయి, సాత్విక్, జీవన్, పండు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.రాజ్యాంగ విలువలను కాపాడుతూ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని నాయకులు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ పరిరక్షణకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.

Sthanikam

హుజూర్‌నగర్‌లో అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News