Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:14 AM

హరితహారంపై హత్యే..! బీ.తుర్కపల్లిలో కానుగ–టేకు చెట్ల ఊచకోత

12-01-2026 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హరితహారానికి హాని.. బీ.తుర్కపల్లిలో కానుగ, టేకు చెట్ల నరికివేత

ప్రాథమిక పాఠశాల వద్ద, ఆర్‌అండ్‌బీ రోడ్డుపై దారుణం

యాదాద్రి భువనగిరి జిల్లా స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలం బీ.తుర్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన విలువైన కానుగ, టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నిర్దాక్షిణ్యంగా నరికివేయడం తీవ్ర కలకలం రేపుతోంది. బీ.తుర్కపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణతో పాటు ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లను లక్ష్యంగా చేసుకుని ఈ అకృత్యం చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం సుమారు 20 వరకు చెట్లను పూర్తిగా నరికివేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులకు నీడనిచ్చే ఉద్దేశంతో, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి చేపట్టిన హరితహారం కార్యక్రమానికే ఇది తూట్లు పొడిచిన చర్యగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా ప్రాథమిక పాఠశాల పరిధిలో చెట్ల నరికివేత జరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్నారులకు స్వచ్ఛమైన గాలి, చల్లని వాతావరణం అందించాల్సిన ప్రదేశంలో పచ్చదనం మాయమవడం తల్లిదండ్రులను కలచివేస్తోంది. అలాగే రహదారి భద్రత, ప్రయాణికులకు నీడ కోసం నాటిన ఆర్‌అండ్‌బీ రోడ్ చెట్లను కూడా నరికివేయడం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన పంచాయతీ కార్యదర్శి ఖదీర్ మాట్లాడుతూ, ఆదివారం రోజు సంఘటన జరగడంతో విషయం తమ దృష్టికి ఆలస్యంగా వచ్చిందన్నారు. సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు పంపించి, నరికివేతకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అలాగే నరికివేసిన ప్రాంతాల్లో తిరిగి మొక్కలు నాటి హరితహారాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక హరితహారం కార్యక్రమాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి అకృత్యాలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

హరితహారంపై హత్యే..! బీ.తుర్కపల్లిలో కానుగ–టేకు చెట్ల ఊచకోత

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News