Sthanikam - Truth Matters
Logo

గుండ్రంపల్లిలో వార్డు సభ్యులకు రెండవ విడత శిక్షణ తరగతులు ప్రారంభం

Updated : 23 Feb 2026 17:13 IST
As Preferred Source 1 min read
గుండ్రంపల్లిలో వార్డు సభ్యులకు రెండవ విడత  శిక్షణ తరగతులు ప్రారంభం

గ్రామాభివృద్ధికి సమిష్టి కృషి అవసరం – కాటం వెంకటేశం

చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి రైతు వేదికలో రెండో విడత వార్డు సభ్యుల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 పంచాయతీ రాజ్ చట్టం గ్రామ పాలనలో కీలకమైన మార్గదర్శకమని తెలిపారు. గ్రామాల విధులు, నిధుల వినియోగం, స్థానిక అవసరాల ఆధారంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ఆయన కోరారు.కార్యక్రమానికి సభాధ్యక్షురాలిగా వ్యవహరించిన ఎంపీడీవో జయలక్ష్మి గ్రామ స్థాయి పాలనలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం అవసరమని పేర్కొన్నారు. గ్రామ నిధులను ప్రాధాన్యత క్రమంలో వినియోగించి ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించాల్సిన అవసరాన్ని వివరించారు.ఎంపీవో కోటయ్య, గుండ్రంపల్లి సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య తదితరులు పాల్గొని వార్డు సభ్యులకు వారి విధులు, నిధుల వినియోగ విధానం, గ్రామ స్థాయి పరిపాలనపై అవగాహన కల్పించారు.ఈ శిక్షణ తరగతుల ద్వారా ప్రజాప్రతినిధులు గ్రామ సమస్యలను సమర్థంగా పరిష్కరించేలా మార్గనిర్దేశం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఇటువంటి శిక్షణలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.

Sthanikam

గుండ్రంపల్లిలో వార్డు సభ్యులకు రెండవ విడత శిక్షణ తరగతులు ప్రారంభం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news