Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 26, 2026 12:38 AM

GST, రోడ్ ట్యాక్స్ చెల్లించినా టోల్ ట్యాక్స్ ఎందుకు? రాఘవ్ చద్దా రాజ్యసభలో గట్టి ప్రశ్న!

GST, రోడ్ ట్యాక్స్ చెల్లించినా టోల్ ట్యాక్స్ ఎందుకు? రాఘవ్ చద్దా రాజ్యసభలో గట్టి ప్రశ్న!

GST, రోడ్ ట్యాక్స్ చెల్లించినా టోల్ ట్యాక్స్ ఎందుకు? రాఘవ్ చద్దా రాజ్యసభలో గట్టి ప్రశ్న!
February 25, 2026 10:55 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

"లీగలైజ్డ్ లూట్".. 5 నిమిషాలు వేచి ఉంటే టోల్ మాఫ్ చేయండి - AAP ఎంపీ డిమాండ్

రాజ్యసభలో AAP ఎంపీ రాఘవ్ చద్దా టోల్ ట్యాక్స్ వ్యవస్థపై తీవ్రంగా విమర్శించారు.వాహనాల కొనుగోలుకు GST, రోడ్ ట్యాక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ చెల్లించినా రోడ్లపై మళ్లీ టోల్ ట్యాక్స్ వసూలు చేయడం "లీగలైజ్డ్ లూట్" అని ఆరోపించారు. టోల్ ప్లాజాల వద్ద 30-40 నిమిషాలు వేచి ఉండి, పాళ్లు, డ్రైనేజీ లేని రోడ్లపై ప్రయాణించాల్సి వస్తోందని, ఇది పౌరులపై అసహ్యకర భారం అని ప్రశ్నించారు.

భారతదేశంలో 950+ టోల్ ప్లాజాలు ఉన్నాయి. 2025లో రూ.80,000 కోట్లకు పైగా టోల్ ట్యాక్స్ వసూలు అయింది. వాహనం కొనేటప్పుడు 28% GST, రోడ్ ట్యాక్స్, పెట్రోల్/డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ డెవలప్‌మెంట్ సెస్ చెల్లిస్తాం. అందుకు తోడు టోల్ ట్యాక్స్ ఎందుకు అని రాఘవ్ ప్రశ్న. "పెట్రోల్ ఫిల్ చేసేటప్పుడు రోడ్ సెస్ చెల్లిస్తాం, అందరూ చెల్లిస్తాం. టోల్ వసూలు చేసి రోడ్లు మెరుగుపరచాలి కానీ పాళ్లు, లైటింగ్ లేకుండా ఉన్నాయి" అనివిమర్శించారు.

రాఘవ్ చద్దా ప్రధాన డిమాండ్లు:

5 నిమిషాలు వేచి ఉంటే టోల్ మాఫ్: "టోల్ ప్లాజాల వద్ద 5 నిమిషాలు వేచి ఉంటే ఆ రోడ్డు ఉచితంగా ఉండాలి" అని ప్రతిపాదించారు.

కాస్ట్ రికవరీ తర్వాత టోల్ ఆపండి: చాలా టోల్ ప్లాజాలు 15-20 సంవత్సరాలుగా రన్ అవుతున్నాయి. ప్రాజెక్ట్ కాస్ట్ రికవర్ అయితే టోల్ ఆపాలి.

FASTag సమస్యలు: FASTagలో టెక్నాలజీ లోపాలు, డబ్బు డెడక్ట్ కాకపోవడం సమస్యలు.

కేరళ, J&K హైకోర్టులు ఇప్పటికే ఈ అంశంపై తీర్పులు ఇచ్చాయి. కేరళ HC "పూర్తి కాకుండా ఉన్న రోడ్లపై టోల్ వసూలు చేయకూడదు" అని, J&K HC 80% రిలీఫ్ ఇచ్చింది. రాఘవ్ ఈ తీర్పులను ఉదహరించారు. టోల్ వేచి ఉండటంతో ఫ్యూయల్ వేస్ట్, ప్రొడక్టివిటీ లాస్, టైమ్ వేస్ట్ జరుగుతోందని ఆర్థిక నష్టాన్ని హైలైట్ చేశారు.

రోడ్ ట్రాన్స్‌పోర్ట్ మంత్రి నితీష్ గద్కరి స్పందిస్తూ, "2026 నాటికి కెమెరాల ద్వారా ఆటోమేటిక్ టోల్ డెడక్షన్ అవుతుంది. వేచి ఉండాల్సిన అవసరం లేదు" అనితెలిపారు. రాఘవ్ ప్రశ్నలు ప్రజల మద్దతు పొందాయి. సోషల్ మీడియాలో #AbolishTollTax, #RaghavChadhaParliament ట్రెండింగ్‌లోకి వచ్చాయి. డ్రైవర్లు, ట్రక్ ఓనర్లు తమ అనుభవాలు షేర్ చేస్తున్నారు.

భారత్‌లో హైవే నెట్‌వర్క్ 1.46 లక్షల కి.మీ.కి చేరింది. NHAI టోల్ ద్వారా రోడ్ల నిర్మాణానికి డబ్బు సేకరిస్తోంది. కానీ ప్రజలు "చెల్లించినప్పటికీ సరైన రోడ్లు లేవు" అని ఫిర్యాది. రాఘవ్ డిమాండ్ ప్రభుత్వాన్ని ఆలోచింపజేస్తోంది.టోల్ వ్యవస్థలో పారదర్శకత, రోడ్ నిర్మాణ నాణ్యత మెరుగుపడాలని ప్రజలు ఆశిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News