Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:21 AM

గ్రామీణ స్థాయి క్రీడలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించడంలో పాలక ప్రభుత్వాలు విఫలం

11-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

గడ్డం వెంకటేష్,ఎండి.సలీం

స్థానికం యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

గ్రామీణ స్థాయి క్రీడలకు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించడంలో పూర్తిగా విఫలం అయ్యాయని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం వెంకటేష్ ఎండి సలీం అన్నారు.ఆదివారం అర్బన్ కాలనీలో అర్బన్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ మరియు డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను వారు ప్రారంభించి మాట్లాడుతూ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడలకు ప్రత్యేక బడ్జెట్లు కేటాయించడంలో విఫలమయ్యాయని ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప గ్రామస్థాయి క్రీడలకు గుర్తింపు ఇవ్వడంలో ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించడంలో చిన్న చూపు చూపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో అనేకమంది యువత క్రీడల పట్ల ఆసక్తి చూపుతూ మట్టిలో మాణిక్యాల గా ఉన్న పాలక ప్రభుత్వాలు మాత్రం వారిని ప్రోత్సహించి ఉన్నత స్థాయికి తీసుకురావడంలో ప్రత్యేక దృష్టి పెట్టడం లేదని వారు అన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ గ్రామీణ స్థాయి క్రీడల పట్ల తమ వైఖరిని చెప్పడంలో విఫలమయ్యాయని వారు అన్నారు.జిల్లావ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే సంక్రాంతి క్రీడోత్సవాలను ప్రజలు ఆదరించి జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు,వీరితోపాటు రెడ్ క్రాస్ కమిటీ డైరెక్టర్ షేక్ అమిధ్ పాషా అర్బన్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు షేక్ రియాజ్,డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఎండి.సాజిద్,ఫయాజ్ సందీప్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామీణ స్థాయి క్రీడలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించడంలో పాలక ప్రభుత్వాలు విఫలం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News