Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:39 AM

గోగువారిగూడెం అంగన్వాడీ కేంద్రం–2లో పోషణ పక్వాడ కార్యక్రమం

13-04-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అంగన్వాడీల్లో THR, గ్రోత్ మానిటరింగ్, కౌన్సిలింగ్ ఉచితం: సీడీపీఓ రేఖల మమత

శిశువుకు ‘గోల్డెన్ 1000 డేస్’ ప్రాముఖ్యతపై అవగాహన: సూపర్వైజర్ వాణి

మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్ట్ సీడీపీఓ రేఖల మమత ఆదేశాల మేరకు ఈనెల 9 నుంచి 23 వరకు నిర్వహిస్తున్న పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా సోమవారం చిల్లపురం సెక్టర్ పరిధిలోని గోగువారిగూడెం అంగన్వాడీ కేంద్రం–2లో అవగాహన సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సూపర్వైజర్ వాణి మాట్లాడుతూ శిశువు జీవితంలో అత్యంత కీలకమైన ‘గోల్డెన్ 1000 డేస్’ (గర్భధారణ నుంచి 2 సంవత్సరాల వరకు) ప్రాముఖ్యతను తల్లులకు వివరించారు. ఈ కాలంలోనే బిడ్డ మెదడు వికాసం 80 శాతం పూర్తవుతుందని, సరైన పోషణ లేకపోతే భవిష్యత్తులో నేర్చుకునే సామర్థ్యం దెబ్బతింటుందని తెలిపారు.

పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు బిడ్డ ఎత్తు, బరువు సరిగా పెరగకపోతే ‘స్టంటింగ్’ సమస్య వస్తుందని, ఒకసారి అది ఏర్పడితే తిరిగి సరిచేయడం కష్టమని హెచ్చరించారు. అలాగే ఈ దశలో సరైన పోషకాహారం అందితే భవిష్యత్తులో షుగర్, బీపీ, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పేర్కొన్నారు.

గర్భిణీ స్త్రీలు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవడం, టీకాలు వేయించుకోవడం, పోషకాహారం తీసుకోవడం అవసరమని సూచించారు. పుట్టిన తర్వాత మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, 6 నెలల తర్వాత సప్లిమెంటరీ ఆహారం అందించాలని వివరించారు. పరిశుభ్రత పాటించడం కూడా అత్యంత కీలకమని చెప్పారు.

అంగన్వాడీ కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ (THR), గ్రోత్ మానిటరింగ్, కౌన్సిలింగ్ సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సీడీపీఓ రేఖల మమత సూచించారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వాణి, అంగన్వాడీ టీచర్ బంధనకంటి ఝాన్సీ రాణి, హెల్పర్లు రమణమ్మ, వీబీకే ఏశోద, స్వాతి, గర్భిణీ స్త్రీలు, బాలింత తల్లులు, కిషోర్ బాలికలు పాల్గొన్నారు.

Sthanikam

గోగువారిగూడెం అంగన్వాడీ కేంద్రం–2లో పోషణ పక్వాడ కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News