Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:30 AM

‘గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం’ జగన్ రాజకీయ ముసుగులో ఫ్యాక్షనిస్టు: మాన్వి దేవేంద్రప్ప

24-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కర్నూలు, మే 24: హత్యా రాజకీయాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ముసుగులో ఉన్న ఫ్యాక్షనిస్టు అని ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప తీవ్రస్థాయిలో విమర్శించారు. సమాజంలో విద్వేషాలు, హింస, కక్ష రాజకీయాలను పెంచే ‘గొడ్డలి పార్టీ’ రాష్ట్రానికి హానికరమని మండిపడ్డారు.

ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుండటాన్ని తట్టుకోలేక జగన్ వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, వైసీపీ పాలనలో జరిగిన ఘటనలను ప్రజలు మరచిపోలేదన్నారు.

జగన్ వ్యాఖ్యలతో రాజారెడ్డి దమనకాండ, వైఎస్ కుటుంబ రాజకీయ చరిత్ర మళ్లీ చర్చకు వచ్చిందన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు, ఇతర రాజకీయ ఘటనలపై రాష్ట్ర ప్రజలకు పూర్తి అవగాహన ఉందని వ్యాఖ్యానించారు.

తిరుమల, హిందూ దేవాలయాల అంశాలను ప్రస్తావిస్తూ వైఎస్ కుటుంబం హిందూ దేవుళ్లపై కక్షతో వ్యవహరించిందని ఆరోపించారు. సోషల్ మీడియాలో అసభ్య ప్రచారాలు, రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు, హింసాత్మక ఘటనలు వైసీపీ పాలనలో పెరిగాయని విమర్శించారు.

ఉద్యోగులు, రైతులు, సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం ఇంధన ధరలు తగ్గించినా జగన్ ప్రభుత్వం తగ్గించలేదని విమర్శించారు.

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తోందని, జగన్ చేసే ప్రతి ఆరోపణకు సమాధానం ఇస్తామని మాన్వి దేవేంద్రప్ప హెచ్చరించారు.

Sthanikam

‘గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం’ జగన్ రాజకీయ ముసుగులో ఫ్యాక్షనిస్టు: మాన్వి దేవేంద్రప్ప

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News